ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకట నరసయ్య కుటుంబ కలహాలతో సోమవారం సాయంత్రం పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.