
మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలానగర్‌కు చెందిన ఓ మహిళ(27) అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. గంజాయి కేసులో అరెస్టై జైలుకెళ్లిన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జహంగీర్ అనే వ్యక్తి అత్యాచారం చేయడంతో ఆమె బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.