
గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 8 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 3, వరంగల్ 0, జనగామ 1 , జయశంకర్ భూపాలపల్లి 0, మహబూబాబాద్ 2, ములుగు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ 2 డోసుల వాక్సిన్ తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.