తెలంగాణలో 4 ప్లేస్ లో హన్మకొండ జిల్లా

-

తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కొవిడ్ పాజిటివ్ కేసుల్లో హన్మకొండ జిల్లా నాలుగో స్థానానికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండగా పాజిటివ్ కేసుల పెరుగుదల్లో మొదటి స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ 1,452, రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి 232, మూడోస్థానం రంగారెడ్డిలో 218 కేసులు నమోదవగా, హన్మకొండ జిల్లాలో 54 కేసులతో నాలుగో స్థానంలో ఉందని వైద్య అధికారులు తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తప్పకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news