మహబూబాబాద్: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న నెపంతో సుపారి గ్యాంగ్ తో కలిసి చంపిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లుతెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకటరత్నం వెల్లడించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.