వ‌రంగ‌ల్‌లో అమానుష ఘ‌ట‌న‌

వ‌రంగ‌ల్, జ‌న‌వ‌రి 5 : హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం కడిపికొండలో అమానుష ఘ‌టన చోటుచేసుకుంది. రాజీవ్ గృహ కల్పన ఆవరణలో నవజాత ఆడశిశువు మృతదేహన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదలిపెట్టి వెళ్లారు. ఆడ శిశువు మృతదేహన్ని కుక్కలు పీక్కుతినగా దృశ్యాన్ని చూసి స్థానికులు చలించిపోయారు.

పోలీసులు ఘ‌టనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చంపి పడేశారా…లేక బతికుండగానే పడి వేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. దగ్గరలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.