గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చిరుమర్తిలో చోటు చేసుకుంది. మండలంలోని చిరుమర్తి గ్రామానికి చెందిన బుర్రి శ్రావణ్ (32) సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెలో నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు తెలపడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో చనిపోయాడు.