రాజకీయాల్లో ప్రత్యర్ధులని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు…బలం లేదు అనుకుంటే సడన్ గా వారితోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బలం లేదని చంద్రబాబు లాంటి నేతలని తక్కువ అంచనా వేయకూడదు…ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయో..ఏ విధంగా పరిస్తితులని తారుమారు చేసి…తనకు అనుకూలంగా మార్చుకుంటారో గతం చెబుతుంది. ఏ క్షణాన్నైనా ఆయన రాజకీయాలని మార్చేయగలరు..అందుకే అధికార వైసీపీ ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి.
నిజానికి గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ బలం చాలావరకు తగ్గిపోయింది…ఘోర ఓటమి దెబ్బకు పార్టీ పరిస్తితి దిగజారింది. ఈ ఓటమి బాబుకు భారీ దెబ్బే అని చెప్పొచ్చు. పైగా జగన్ అధికార పీఠంలో కూర్చున్నాక ఆయన వేసే ప్రతి స్టెప్…టీడీపీని దెబ్బకొట్టేది అన్నట్లే ఉంది. అలాగే రాజకీయం జరుగుతూ వచ్చింది. అడుగడుగున చంద్రబాబుకు చుక్కలు చూపించడమే దిశగా వైసీపీ ముందుకెళ్లింది.
అలాగే పంచాయితీ నుంచి పరిషత్ వరకు…మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు అన్నీ ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తు చేసి వైసీపీ వన్ సైడ్ గా గెలిచింది. మరి ఈ గెలుపు కేవలం ప్రజా బలంతో వచ్చిందేనా అంటే…అధికార బలం లేకుండా ఇలాంటి విజయాలు కష్టమని చెప్పొచ్చు. ఇక వరుసపెట్టి ఉపఎన్నికల్లో గెలిచింది. ఏదేమైనా గాని వైసీపీకి తిరుగులేదనే పొజిషన్ ఉంది. అందుకే అనుకుంటా జగన్ సైతం..ఇన్ని విజయాలు సాధించాం కదా…నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అంటున్నారు.
అంటే రాష్ట్రంలో చంద్రబాబు పని అయిపోయిందనేది జగన్ భావన..అలాగే వైసీపీ నేతలు అడుగడుగున బాబు ఇంకా రాజకీయాలని రిటైర్ అవ్వాలని, టీడీపీ మూసేసుకోవాలని కామెంట్లు చేస్తూనే వస్తున్నారు. మరి వైసీపీ ఇదే భావనతో ముందుకెళితే పప్పులో కాలేసినట్లే అని చెప్పొచ్చు…ఎందుకంటే బాబుని అసలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వయసు మీద పడిన సరే…తనదైన సమయంలో మొత్తం తిప్పేయగల సామర్థ్యం బాబుకు ఉంది.
2019 ఎన్నికల తర్వాత వైసీపీ ఎంత వన్ సైడ్ గా వచ్చినా సరే బాబు…టీడీపీని బలోపేతం చేయకుండా ఆగలేదు…నిత్యం వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతూనే…మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీని దాటే బలం టీడీపీకి రాకపోవచ్చు…కానీ టీడీపీ చాలా నియోజకవర్గాల్లో పుంజుకుంది. దాదాపు 60 పైనే స్థానాల్లో ఆ పార్టీ పరిస్తితి మెరుగైందని సర్వేలు చెబుతున్నాయి.
ఇక ఎన్నికలనాటికి పార్టీ బలం ఇంకా పెంచుకుంటే వైసీపీకి ఇబ్బంది తప్పదు. పైగా అధికారంలోకి రావడం కోసం బాబు ఎలాంటి ఎత్తు అయిన వేస్తారు..పవన్ కల్యాణ్ ని సైతం దగ్గర చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు బాబు పని ఇంకా ఈజీ అవుతుంది…అందుకే బాబుని వైసీపీ తేలిగ్గా తీసుకోకూడదు. 2012 ఉపఎన్నికల్లో అదిరిపోయే విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న వైసీపీ..2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు…కానీ ఒకే ఒక ఏడాదిలో బాబు రాజకీయం మార్చేసి..తనకు అనుకూలంగా పరిస్తితులు ఏర్పరచుకుని…అనూహ్యంగా 2014లో అధికారంలోకి వచ్చారు..కాబట్టి బాబుని లైట్ తీసుకోకూడదు.