బాబు.. ఇక చాలు.. టీడీపీని వదిలెయ్.. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు అందివ్వు…!

టీడీపీని వదిలెయ్. టీడీపీ పార్టీని సొంత మామ దగ్గర్నుంచి గుంజుకొని పార్టీనే భ్రష్టు పట్టించావు. ఇంకా దేనికోసం నీ ఆరాటం. పార్టీని నాశనం చేసేదాకా నువ్వు నిద్రపోలేదు. మొన్న తెలంగాణలో పార్టీ భూస్థాపితం అయిపోయింది.

చంద్రబాబు.. ఇక చాలు.. టీడీపీని నువ్వు భూస్థాపితం చేసింది చాలు. ఇక ఆపు. నీ ఆటలు ఇంతటితో ఆపు. నువ్వు ఇంకా ఇలాగే మొంటి పట్టుతో ఉంటే.. తెలంగాణలో టీడీపీ పని అయినట్టే ఏపీలోనూ అవుతుంది. దేనికోసమైతే ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని పెట్టారో.. ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా పార్టీని నువ్వు నడిపిస్తున్నావు. దానికి ఏపీ ప్రజలు కూడా నీకు సరైన బుద్ధి చెప్పారు. ఇక చాలు. ఇంతటితో నీ గేమ్స్ ఆపేయ్.

Chandrababu should handover tdp to junior ntr

టీడీపీని వదిలెయ్. టీడీపీ పార్టీని సొంత మామ దగ్గర్నుంచి గుంజుకొని పార్టీనే భ్రష్టు పట్టించావు. ఇంకా దేనికోసం నీ ఆరాటం. పార్టీని నాశనం చేసేదాకా నువ్వు నిద్రపోలేదు. మొన్న తెలంగాణలో పార్టీ భూస్థాపితం అయిపోయింది. నిన్న ఏపీలోనూ భూస్థాపితం అయిపోయింది. ఇంకేంటి.. నీకు ఇంకేం కావాలి. టీడీపీ భూస్థాపితమేగా నీకు కావాల్సింది.

ఇప్పటికైనా టీడీపీని బతకనివ్వు. నువ్వు, నీ కొడుకు కలిసి టీడీపీని నాశనం చేసినకాడికి చాలు. 2009లోనే నువ్వు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీలో ప్రాధాన్యం కల్పించి ఉంటే ఇప్పుడు నీకు ఈ గతి పట్టి ఉండేదు కాదు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. వదిలేయ్. టీడీపీని వదిలేయ్. పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కు అందించు. నువ్వు తప్పుకో. అప్పుడే పైన ఉన్న ఆ పెద్దాయన ఆత్మ శాంతిస్తుంది. కనీసం ఆ పెద్దాయన ఆత్మ శాంతి కోసమైనా పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించి.. నువ్వు నీ మనవడు దేవాంశ్ తో ఆడుకుంటూ నీ శేష జీవితాన్ని గడుపు. అంతే నీకు ఇదొక్కటే దారి. నువ్వు చేసిన పాపాలన్నింటికీ ప్రాయచ్చిత్తం కలగాలంటే నీకు ఇదొక్కటే దారి. వేరే దారి లేదు. నీ దారులన్నీ మూసుకుపోయాయి.

టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ వల్లనే అవుతుంది. మళ్లీ ఎన్టీఆరే దానికి ప్రాణం పోయగలడు. అప్పుడు ఆ ఎన్టీఆర్.. ఇప్పుడు ఈ ఎన్టీఆర్.. వీళ్ల వల్లనే అసలు సిసలు టీడీపీ లక్ష్యం నెరవేరేది. అందుకే.. నువ్వు చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని పార్టీ నుంచి తప్పుకో. అదే నీకు ఉత్తమం.