ఎడిట్ నోట్: బీజేపీ ‘ఘర్‌వాపసీ’..!

-

తెలంగాణలో బీజేపీ ఘర్‌వాపసీ చేపట్టింది. వివిధ కారణాల చేత బి‌జే‌పిని వదిలి వెళ్లిపోయిన నేతలు మళ్ళీ తిరిగిరావాలని తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.  బీజేపీ సైద్ధాంతిక భావాలు ఉండి, చిన్న చిన్న కారణాలతో పార్టీని వీడినవారంతా తిరిగి రావాలని, ఘర్‌ వాపసీని విజయవంతం చేద్దామని అన్నారు. అలాగే బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుందని, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని చెప్పుకొచ్చిన సంజయ్‌.. కార్యకర్తలు నాయకుల స్థాయికి ఎదిగే అవకాశాలు బీజేపీలోనే వస్తాయని చెప్పారు.

BANDI SANJAY : బీజేపీలోకి రండి

ఇక బీజేపీలో సాధారణ కార్యకర్తగా ఉన్న తాను ఈ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యానని.. చాయ్‌వాలా ఈ దేశ ప్రధాని అయ్యారని చెప్పుకొచ్చారు. అయితే మొత్తానికి ఘర్‌వాపసీ కార్యక్రమం చేపట్టారు. 2014, 2018 ఎన్నికల తర్వాత కొంతమంది బి‌జే‌పి నేతలు బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నేతలు ఉన్నారు. అలాంటి వారు తిరిగి బి‌జే‌పిలోకి రావాలని బండి సంజయ్ కోరుతున్నారు. కానీ వారు మళ్ళీ తిరిగి వస్తారో లేదో క్లారిటీ లేదు. కాకపోతే వారితో వ్యక్తిగతంతో టచ్ లో ఉంటూ, మాట్లాడితే వారు ఏమైనా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది.

 

కాకపోతే బి‌జే‌పి..కాంగ్రెస్ నేతలపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది బి‌ఆర్‌ఎస్ నేతలపై ఫోకస్ పెట్టిన వారు ఇప్పుడున్న పరిస్తితుల్లో బయటకొచ్చేలా కనిపించడం లేదట. దీంతో కాంగ్రెస్ లోని బలమైన నేతలపై బి‌జే‌పి ఫోకస్ చేసిందని తెలిసింది. బి‌జే‌పి చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్..పలువురు కాంగ్రెస్ నేతలకు బి‌జే‌పిలో చేరాలని ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి బి‌జే‌పి కంటే కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన నేతలు ఉన్నారు. వారిని గాని బి‌జే‌పిలోకి తీసుకొస్తే..బలం పెరుగుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే కొందరు కాంగ్రెస్ నేతలకు పెద్ద ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. అటు బి‌ఆర్‌ఎస్ నేతలతో సైతం టచ్ లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. కానీ అటు నుంచి స్పందన పెద్దగా వస్తున్నట్లు కనిపించడం లేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెరపైకి వచ్చిందో అప్పటినుంచి కాస్త పరిస్తితి మారింది. అందుకే ఈ మధ్య బి‌జే‌పిలో చేరికలకు బ్రేక్ పడింది. మరి రానున్న రోజుల్లో చేరికలు ఏ మేర ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news