ఎడిట్ నోట్: కారు-కమలం ఫైట్..మధ్యలో షర్మిలకు హైప్.!

-

 తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్ధం కాకుండా ఉంది. అసలు ఉప్పు-నిప్పు మాదిరిగా టీఆర్ఎస్-బీజేపీలు తలపడుతున్నాయి. రెండు పార్టీల నేతలు బద్ధశత్రువులు మాదిరిగా తిట్టుకుంటున్నారు. ఒకరినొకరు చెక్ పెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో ఎవరి అధికారాలని వారు వాడి..దర్యాప్తు సంస్థలతో రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నాయి.

Telangana: Kavitha, Sharmila trade barbs on Twitter

ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీ, సి‌బి‌ఐ సంస్థలు..టీఆర్ఎస్ నేతల లక్ష్యంగా దూకుడు కనబరుస్తున్నాయి. ఇప్పటికే క్యాసినో వ్యవహారంపై ఈడీ దాడులు నడుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడమే కాదు..ఈడీ రిపోర్టులో ఆమె పేరు నమోదైంది. దీంతో కవిత అరెస్ట్ తప్పదని ప్రచారం మొదలైంది. కవిత లిక్కర్ స్కామ్‌లో ఉందని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదంతా బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో జరుగుతుందని, రాజకీయంగా ఢీకొట్టలేక ఇలా ఈడీ, ఐటీ, సి‌బి‌ఐ అంటూ హడావిడి చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

ఇలా ఈడీ వేడి నడుస్తుండగానే..మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ షాకులు కొనసాగుతున్నాయి. అటు సి‌బి‌ఐ..మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజులకు నోటీసులు ఇచ్చింది. అలాగే వారిని విచారించింది. ఇలా టీఆర్ఎస్‌ పార్టీకి దర్యాప్తు సంస్థల వాడి తగులుతుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరుకున పెట్టేలా సిట్ ముందుకెళుతుంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే బి‌ఎల్ సంతోష్ లాంటి వారిని రిపోర్టులో చేర్చారు. అలాగే ఈ వ్యవహారంలో రోజుకో అంశం తెరపైకి వస్తుంది. ఆ నలుగురు ఎమ్మెల్యేలనే కాకుండా..ఇంకా చాలామంది నేతలని లాగడానికి వల పన్నారని తెలిసింది.

ఇదంతా ఒక వైపు నడుస్తుంటే..మరోవైపు షర్మిల ఇష్యూ నడుస్తుంది. పాదయాత్రలో షర్మిల…టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, మంత్రులని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి తిడుతున్నారు. దీంతో తాజాగా నర్సంపేటలో ఆమెపై టీఆర్ఎస్ ఎటాక్ మొదలుపెట్టింది. ఇక ఆమెకు బీజేపీ నేతలు మద్ధతు తెలిపారు. దీంతో షర్మిల..బీజేపీ వదిలిన బాణం అని టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. అయితే ఇంతకాలం షర్మిల రాజకీయాలకు పెద్ద హైప్ రాలేదు. కానీ తాజా ఘటనలతో షర్మిలకు ఒక్కసారిగా హైప్ వచ్చింది. మొత్తానికి తెలంగాణలో రాజకీయ రగడ ఓ రేంజ్‌లో నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news