ఎడిట్  నోట్ : అమ‌రావ‌తి ప్రేమ‌లో కేసీఆర్ !

-

ఈ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఇటు ఆంధ్రాలోనూ త‌న స‌త్తా చాటేందుకు చూస్తున్నారు.త్వర‌లో జాతీయ పార్టీ పెడితే ఇటు కూడా ఆయ‌న త‌ర‌ఫున అభ్య‌ర్థులు పోటీచేసేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.ఇదే సంద‌ర్భంలో ష‌ర్మిల కూడా ఓ పార్టీ పెడితే ఇంకా పోరు ర‌స‌వ‌త్త‌రం అయిపోనుంది.

అయితే వినూత్నంగా జ‌న‌సేన కూడా ఇటు కేసీఆర్ తోనూ అటు బీజేపీతోనూ స‌ఖ్యంగానే ఉంటుంది క‌నుక ఆంధ్రాలో ఎవ‌రికి పోటీ అవుతోంది ఎవ‌రితో పొత్తుతో ఉంటుందో కూడా తేల్చ‌లేం ఇప్పుడే ! కానీ కేసీఆర్ మాత్రం అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తున్నారు అని తెలుస్తోంది. ఇది కేవ‌లం హైపోథిటిక‌ల్ నెరేష‌న్ మాత్ర‌మే! అంటే ఊహాగానాల‌కు ప్రాధాన్యం ఇస్తూ రాస్తున్న క‌థ‌న‌మే! అయితే కావొచ్చు! కాకుండా పోయేందుకు అవ‌కాశ‌మే లేదు.

ఎందుకంటే..కేసీఆర్ చూపు ఆంధ్రా వైపు ఉంది.ఇక్క‌డ 25 మంది ఎంపీలు ఉన్నా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా రెండు పార్టీల త‌ర‌ఫున గొంతుక‌లు కూడా పెద్ద‌గా వినిపించ‌డం లేదు. అంతోఇంతో టీడీపీ త‌ర‌ఫున ఉత్త‌రాంధ్ర యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కింజ‌రాపు త‌ప్ప ఎవ్వ‌రూ మాట్లాడ‌డం లేదు.ఈ ద‌శ‌లో దేశ రాజ‌కీయాల్లో ఎంపీ రామును త‌మ‌కు అనుగుణంగా వినియోగించుకునేందుకు  చూస్తున్నారు కేసీఆర్.ఇదే స‌మ‌యంలో టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తున్న ఉద్య‌మానికే అంటే అమ‌రావ‌తి ఉద్య‌మానికే కేసీఆర్ కూడా మ‌ద్ద‌తు ఇచ్చి ఈ ప్రాంత ప్ర‌జ‌ల మెప్పు పొంద‌డం ఖాయం.

ఎలానూ భూములు సంపాదించుకున్నాక కొందరు మాట మార్చి రాజ‌కీయం చేస్తున్నార‌ని ఇవాళ వైసీపీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు టీడీపీ చేస్తోంది.మ‌రోవైపు వైసీపీ కూడా ఉద్య‌మాన్ని బాగా కించ‌ప‌రుస్తోంది.ఉద్య‌మాల‌ను గౌర‌వించే పార్టీలుగా ఆంధ్రాలో జ‌న‌సేన‌తో స‌హా క‌మ్యూనిస్టులు ఉన్నాయి.బీజేపీ కూడా అమ‌రావ‌తికి స‌పోర్టు చేస్తోంది.అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇచ్చి త‌న‌దైన పంథాలో వైసీపీకి చెక్ పెట్టాల‌ని చూస్తున్నారు.ఇదే క‌నుక నిజం అయితే ఆంధ్రా రాజ‌కీయాల్లో కేసీఆర్ నిల‌దొక్కుకోవ‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news