ఎడిట్ నోట్: కాదేదీ ‘కవిత’కు అనర్హం..!

-

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు..ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పేరు వినిపించడం..ఈడీ రిపోర్టులో పేరు రావడం.. సీబీఐ నోటీసులు జారీ చేయడం..ఇలా ప్రతి దానిలోనూ కేసీఆర్ కుమార్తె కవితకు లింక్ అవుతూనే ఉంది. మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవిత ఉన్నారని..ఢిల్లీలోని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఇదట బీజేపీ కుట్ర అని, ఆ స్కామ్‌తో తనకు సంబంధం లేదని కవిత కొట్టిపారేశారు.

 

 

 

సరే కవిత అన్నారు కదా..నిజమే అని కొంతమంది అనుకున్నారు…అయినా సరే ఆ స్కామ్‌లో కవిత పేరు వినిపిస్తూనే ఉంది. కానీ ఈ మధ్య సడన్‌గా ఈడీ రిపోర్టులో కవిత పేరు నమోదైంది. అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు రాగా, దాన్ని ఈడీ రిపోర్టులో నమోదు చేసింది. దీంతో అసలు కథ మొదలైంది. మళ్ళీ అదే వరుసలో ఇదంతా బీజేపీ కుట్ర అని, మోదీ వచ్చే ముందు, ఈడీ రావడం కామన్ అని, తాను ఏ విచారణకైనా సిద్ధమని, అవసరమైతే అరెస్ట్‌కు సిద్ధమని కవిత ప్రకటించారు.

కానీ స్కామ్‌తో తనకు సంబంధం లేదని, ఫోన్లు ధ్వంసం చేశారని, ఆధారాలు నాశనం చేశారని, రూ.100 కోట్ల ముడుపుల అంశంపై మాత్రం నోరు మెదపలేదు. ఎంతసేపు ఇది బీజేపీ కుట్ర అని ఫ్రేమ్ చేసే పనిలోనే ఉన్నారు. ఇదంతా జరుగుతుండగానే ఇప్పుడు సీబీఐ నోటీసులు వచ్చాయి. ఈ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంస్థలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దర్యాప్తు అధికారి అలోక్‌ కుమార్‌ షాహి కవితకు నోటీసులు జారీ చేశారు.

ఈమేరకు ఈ నెల 6న ఉదయం 11 గంటలకు మిమ్మల్ని విచారించడానికి మీకు అనుకూలంగా ఉండే నివాసమేదో హైదరాబాద్‌ లేదా వీలైనంతవరకూ ఢిల్లీ చెప్పండి’’ అని కవితకు జారీ చేసిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఈ నోటీసులపై కవిత కూడా స్పందించారు. వారి అభ్యర్థన మేరకు.. హైదరాబాద్‌లోని నివాసంలో తనను ప్రశ్నించాల్సిందిగా సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికి కథ సీబీఐ విచారణ వరకు వచ్చింది. మరి ఆ విచారణలో ఏం తేలుతుంది..స్కామ్‌లో కవిత పాత్ర ఉందని తేలుస్తారా? ఆమె అరెస్ట్ జరుగుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం వచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news