ఎడిట్ నోట్: సారు…జోరు లేదే!

-

కేసీఆర్ అంటే కాన్ఫిడెన్స్…ఎదుట ఎంత బలమైన ప్రత్యర్ధి ఉన్న సరే ఏ మాత్రం బెదరకుండా రాజకీయం చేయడంలో కేసీఆర్ ని మించిన వారు లేదు. ప్రత్యర్ధులకు కేసీఆర్ భయపడే రకం కాదు…ఎప్పుడు తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటూ వెళుతూ…ప్రత్యర్ధులకు చెక్ పెడతారు. అలాగే ఓటములు ఎదురైన సరే…ఆ ఓటమికి క్రుంగిపోరు…ఇంకా దూకుడుగా పనిచేస్తారు. ఇక గత రెండు ఎన్నికల్లో అదిరిపోయే విజయాలని అందుకుని దూకుడుగా రాజకీయం చేస్తున్న కేసీఆర్…ఇప్పటివరకు ప్రత్యర్ధి పార్టీలని చూసి భయపడలేదు. ఎప్పటికప్పుడు ప్రత్యర్ధులని దెబ్బ తీసే విషయంలో కేసీఆర్ పై చేయి సాధిస్తూనే ఉన్నారు.

అసలు ప్రత్యర్ధులకు ఏ మాత్రం భయపడలేదు. కానీ ఈ మధ్య కేసీఆర్ లో భయం మొదలైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా ఉండటం…రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడం…కీలకమైన జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓటమి అంచుకు తీసుకు రావడంతో…కేసీఆర్ లో టెన్షన్ మొదలైంది. బీజేపీ వల్ల రిస్క్ ఉందనే అర్ధమైపోతుంది.

అందుకే కేసీఆర్ మాటల్లో కాస్త కాన్ఫిడెన్స్ తగ్గింది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు. ఈ మునుగోడులో కూడా ఓడిపోతే…మామూలు ఎన్నికల్లో దెబ్బ అయిపోతామని అనుకుంటున్నారు. ఇక ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే బీజేపీకి చెక్ పెట్టే విషయంలో కేసీఆర్ దూకుడు అంతగా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతలే మరింత దూకుడుగా రాజకీయం చేస్తూ…కేసీఆర్ ని ముప్పు తిప్పలు పెడుతున్నారు.

బీజేపీ వల్ల పడే ఇబ్బంది ఏంటో..తాజాగా మునుగోడు సభలో అర్ధమైంది. మునుగోడులో కేసీఆర్ స్పీచ్ చూస్తుంటే…కేసీఆర్ కాస్త అభద్రత భావంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎప్పుడూలేని విధంగా ప్రజలని బ్రతిమలాడుకుంటున్నారు. ఈడీకి బొడీకి భయపడమని, లంగలు, దొంగలు భయపడతారని, మోదీ.. ఏం పీక్కుంటావో పీక్కో అని మాట్లాడారు…అయితే ఈ మాటల్లో వార్నింగ్ కంటే భయమే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది.

“ఇది జీవితాల ఎన్నిక.. నేను కావాలో.. మోదీ కావాలో తేల్చుకోండి…నా బలం, ధైర్యం మీరే.. నన్ను మీరే బలహీనపరిస్తే నేనేం చేయాలి?” అంటూ ప్రజలని అర్ధించే పరిస్తితి. అంటే తనని బీజేపీ ఇబ్బంది పెడుతుందని, ప్రజలే తనని కాపాడుకోవాలని కేసీఆర్ సెంటిమెంట్ లేపుతున్నారు. అంటే కేసీఆర్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి బీజేపీ దెబ్బకు కేసీఆర్ బాగానే భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఏదేమైనా గాని కేసీఆర్ లో మునుపటి జోరు మాత్రం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news