ఎడిట్ నోట్: బీజేపీకి బ్రేకులు..సాధ్యమయ్యేనా!

-

ఎంతకాదు అనుకున్న తెలంగాణలో బీజేపీ దూకుడుగా రాజకీయం చేయడంలో అన్నీ పార్టీల కంటే ముందే ఉంది…ఆఖరికి అధికార టీఆర్ఎస్‌ని సైతం దాటుకుని కమలం రేసులో ముందుంది…ఇప్పటికే వరుస చేరికలతో బీజేపీలో జోష్ పెరిగింది…అలాగే అధినేతల భారీ సభలతో బీజేపీ బలం మరింత పెరుగుతూ వస్తుంది…ఇక బండి సంజయ్ పాదయాత్ర మరో ప్లస్…టీఆర్ఎస్‌పై పోరాటం చేయడం, ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతూ రావడం బీజేపీకి అతి పెద్ద ప్లస్.

అయితే బ్రేకులు లేని బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతున్న బీజేపీకి బ్రేకులు వేయడానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి సాధ్యం కావడం లేదు. పైగా మునుగోడు ఉపఎన్నికలో కూడా బీజేపీ హవా నడిచేలా ఉంది. ఇక ఈ ఉపఎన్నికలో కూడా గెలిస్తే కారు షెడ్‌కు వెళ్ళాల్సిందే…అందుకే సరైన సమయం చూసి బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ వెయిట్ చేసినట్లు కనిపించింది. అదే సమయంలో రాజాసింగ్ వ్యవహారం..టీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా దొరికింది.

ఎప్పుడు వివాదాల్లో ఉండే రాజాసింగ్…తాజాగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో రాజాసింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేయగా, వేంటంటే బెయిల్ వచ్చింది. అయితే రాజసింగ్ వ్యాఖ్యలపై ఎం‌ఐ‌ఎం శ్రేణులు పాతబస్తీలో ఆందోళనలకు దిగాయి. దీంతో పాతబస్తీలో పరిస్తితులు అదుపు తప్పుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై పీడీయాక్ట్ ప్రయోగించి…పోలీసులు తాజాగా మరోసారి అరెస్ట్ చేశారు. దీంతో పాతబస్తీలో అల్లర్లు కాస్త అదుపులోకి వచ్చాయి.

అయితే అటు ఎం‌ఐ‌ఎం, ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు…బీజేపీపై మాటల దాడిని మాత్రం ఆపడం లేదు. బీజేపీ మాట కలహాలని సృష్టించేందుకు చూస్తున్నాయని విమర్శలు చేస్తున్నాయి. అంటే పరోక్షంగా బీజేపీ వల్ల రాష్ట్రం నాశనమైపోతుందనే కోణంలో రాజకీయం నడుపుతున్నారు. ఇక టీఆర్ఎస్, ఎం‌ఐ‌ఎం వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి…వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ని పార్టీని నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయినా సరే టీఆర్ఎస్ కావాలని బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలని రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గాని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ గాని..గతంలో ఒక మతాన్ని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు లేవు…అరెస్టులు లేవు. కానీ రాజాసింగ్ మాట్లాడిన వెంటనే బీజేపీ వేటు వేసింది. ఆ తేడా ప్రజలకు బాగా అర్ధమవుతుందనే చెప్పొచ్చు. కానీ రాజాసింగ్ వ్యాఖ్యలని అడ్డం పెట్టుకుని బీజేపీని అడ్డుకోవాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రకు బ్రేకులు వేయాలని చూస్తుంది..అలాగే వరంగల్ పాదయాత్ర ముగింపు సభకు పర్మిషన్ కూడా రానివ్వడం లేదు.

ఇక కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వినిపించిన విషయం తెలిసిందే…ఈ విషయాన్ని నిదానంగా డైవర్ట్ చేయడానికి బీజేపీ మాట కలహాలు సృష్టింస్తుందనే ఆరోపణలు కేసీఆర్ దగ్గర నుంచి చిన్నపాటి టీఆర్ఎస్ నేత వరకు చేస్తున్నారు. కానీ బీజేపీని ఆపడం అంత ఈజీ కాదనే చెప్పాలి. బీజేపీ కూడా రివర్స్‌లో ఎటాక్ చేస్తూ…టీఆర్ఎస్, ఎం‌ఐ‌ఎం కుట్రలని తిప్పికొడుతుంది. మొత్తానికైతే అంత తేలికగా బీజేపీకి బ్రేకులు వేయడం సాధ్యం కాదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news