మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ పోస్టులని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ని కూడా జారీ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..
కేరళ లోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ లో పలు విభాగాల్లో ఖాళీలున్నాయి. ఇక ఇదిలా ఉంటే పోస్టుల వివరాలను చూస్తే.. ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు ఖాళీగా వున్నాయి. అర్హత గురించి చూస్తే.. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ (ఫిజిక్స్/ మెటియోరాలజీ/ అట్మాస్పిరిక్ సైన్స్), డాక్టోరల్ డిగ్రీ వున్నవాళ్లు అప్లై చేసుకో వచ్చు.
ఇక వయస్సు విషయానికి వస్తే.. వయస్సు వచ్చేసి 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ లో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ వచ్చేసి రూ. 20,000 నుంచి రూ. 67,000 వరకు పే చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 11-11-2022. పూర్తి వివరాలను https://www.ncess.gov.in/notifications/vacancies.html లో చూసి అప్లై చేసుకోవచ్చు.