ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ కల నెరవేరుతుందా..!

ప్రాంతీయ సినిమాగా ఉండే తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతుంది. తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన బాహుబలి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు సూపర్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

తెలుగు రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరి పాత్రల్లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఇక సినిమా అవార్డుల్లో రారాజు అయిన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ లో తెలుగు సినిమా కనీసం ఎంట్రీకి కూడా నోచుకోవట్లేదు. ఈసారి ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి ఆ కల నెరవేరుస్తాడో లేదో చూడాలి. ఆస్కార్ కొట్టకపోయినా పర్వాలేదు కాని ఆస్కార్ నామినేషన్స్ లో అయినా స్థానం సంపాదించేలా ఉండాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.

ఇప్పటికే తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ నామినేట్ అయ్యి మరింత ఖాతి తీసుకురావాలని ఆశిస్తున్నారు తెలుగు సిని అభిమానులు. అయితే అదంత సులువైన విషయమేమి కాదు అలా అని కష్టమైన పని కాదు. జక్కన్న టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు అంటే అది సాధించి తీరుతాడు. సినిమా కలక్షన్స్.. రికార్డులు.. ఇవే కాకుండా తెలుగు సినిమా ఆస్కార్ కలను ఆర్.ఆర్.ఆర్ నిజం చేసేలా రాజమౌళి తెరకెక్కించాలని కోరుకుందాం.