ఎడిట్ నోట్ : ఈ రైలే క‌దా నీ జీవితాన్ని మార్చింది !

-

అగ్నిప‌థ్ మాటెలా ఉన్నా జీవితాన్ని న‌డిపిన రైలు గురించి, జీవితాన్నిమార్చిన రైలు గురించి మ‌నం మాట్లాడుకుంటే కొన్ని ఆశ్చ‌ర్యాలు మ‌రియు ఆనందాలు మ‌రియు నిన్న‌టి విషాదాలు కూడా వినిపిస్తాయి. రైలు నుంచి రైలు వ‌రకు, ఊరి నుంచి ఊరి వ‌ర‌కు గుర్తుకు వ‌చ్చే జ్ఞాప‌కాల ద‌గ్గ‌ర మ‌నుషులంతా ఎలా ఉన్నారో వెత‌కాలి. ఒక స్టేష‌న్ ఆధారంగా లేదా ఆనుకుని కొన్ని వేల
కుటుంబాలు జీవిస్తాయి. మందుల కోసం ఒక‌రు, చదువుల కోసం ఒక‌రు,  జీవితాన్ని మార్చుకోవాల‌న్న త‌ప‌న‌లోభాగంగా ఉద్యోగం కోసం ఒక‌రు  ఈ విధంగా ఎంద‌రో తీసే ప‌రుగుల‌కు ఆ రైలు నిల‌యం ఓ సాక్షి. క‌రోనా వేళ‌ల్లోనూ ఎంద‌రో పేద‌ల‌కు ఆ రైలే ఆధారం.

ఇప్పుడేంటి ఈ మంట‌లు.

రైలు ద‌గ్గ‌ర ఎంద‌రో సామాన్యులు వ‌చ్చి ఆగుతారు. సీటు ఉండ‌దు. నిల‌బ‌డి ప్రయాణించాలి. ప్రయాణిస్తారు. క‌నీసం  కొన్నిసార్లు రైలలో గుక్కెడు నీరు కూడా దొర‌క‌దు.అయినా గ‌మ్యం ప్ర‌ధానం అనుకునే స‌గ‌టు జీవుల‌కు ఆ రైలే ఆధారం. ఆ రైలు కార‌ణంగా ఎన్నో జీవితాలు ఒడ్డున ప‌డ్డాయి. ఎన్నో జీవితాలు ఏమీ లేని వేళ ఎంతో కొంత సంపాదించుకుని ఒడ్డున‌ప‌డ్డాయి. రైలు ఒక పెద్ద బాల‌శిక్ష లాంటిది. అక్క‌డ నేర్చుకోవాల్సినంత నేర్చుకుని త‌రువాత జీవితాన్ని దిద్దుకోవాలి. కానీ రైలు ద‌గ్గ‌ర మ‌నలో ఓ వ‌ర్గం మంట‌లు పోగేసి వికృతాన్ని చూసింది. స్టేష‌న్ తగ‌ల‌బ‌డితే జీవితం వెలిగిపోతుంద‌ని ఎవ‌రు చెప్పారో వీళ్ల‌కు. ఈ రైలే క‌దా నీ త‌ల్లిని గ‌మ్య స్థానానికి చేర్చింది అని ఒక్క‌సారి అయినా అనుకుంటే ఈ గ‌తాడా ఉండేది కాదు. ఇంత‌టి ఆస్తిన‌ష్టం ఉండేదే కాదు.

ఇప్పుడు రైల్వే కోర్టులు సిద్ధంగా ఉన్నాయి. నిందితులను శిక్షించేందుకు 14కు పైగా కీల‌కం అనుకునే  సెక్ష‌న్లు సిద్ధంగా ఉన్నాయి. ఇండియ‌న్ రైల్వే యాక్ట్ లో భాగంగా సెక్ష‌న్ 150 కింద కేసు రుజువు అయితే యావ‌జ్జీవ కారాగార శిక్ష త‌ప్ప‌దు.ఇది కాక కొన్ని సెక్ష‌న్ల కింద కేసు న‌మోద‌యితే అస్స‌లు ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎంట్ర‌న్స్ టెన్స్ రాయ‌డానికి కూడా వీలుండ‌దు. చాలా సెక్షన్లు నాన్ బెయిల్ బుల్. ఇప్పుడు చెప్పండి ఆవేశం కార‌ణంగా ఎవ్వ‌రు అయినా ఏం సాధించారో ?

Read more RELATED
Recommended to you

Latest news