బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 551 ఖాళీలు.. అర్హత, అప్లై చేసుకునే విధానం మొదలైన వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర లో పలు పోస్టులు కాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పుణెలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

దీనిలో మొత్తం 551 ఖాళీలు వున్నాయి. వేర్వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. పోస్టుని బట్టీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ పూర్తి చేసుండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు 23-12-2022ని చివరి తేదీ. పూర్తి వివరాలను https://bankofmaharashtra.in/current-openings# లో చూసి అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

ఏజీఎం బోర్డ్ సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్- 1
ఏజీఎం- డిజిటల్ బ్యాంకింగ్- 1
ఏజీఎం- నిర్వహణ సమాచార వ్యవస్థ-1
చీఫ్ మేనేజర్- ఎంఐఎస్‌ 1
చీఫ్ మేనేజర్- మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ 1
చీఫ్ మేనేజర్- ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్-1
చీఫ్ మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్ 2
చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ 1
చీఫ్ మేనేజర్- క్రెడిట్ 15
చీఫ్ మేనేజర్- పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్ 1
చీఫ్ మేనేజర్- డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 1
జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్‌ స్కేల్-2 పోస్టులు 400
జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్‌ స్కేల్-3 పోస్టులు100
ఫారెక్స్/ ట్రెజరీ ఆఫీసర్- 25

Read more RELATED
Recommended to you

Latest news