Flash news: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. DRDO, DRL లో ఖాళీలు..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రిసెర్చ్ లాబరేటరీ(DRL), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

DRDO

ఉద్యోగాలకు అప్లై చేసేందుకు జులై 31ని ఆఖరి తేదీ. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. జూనియర్ రిసెర్చ్ ఫెలో(JRF), రీసెర్చ్ అసోసియేట్స్(RA) తదితర విభాగాల్లో ఈ నియామకాలను చేపట్టారు. కేవలం ఏడు పోస్టులే వున్నాయి. ఇందులో జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో 4, రిసెర్చ్ అసోసియేట్ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి.

టెక్స్టైల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ లేదా బయోటెక్సాలజీలో ఎమ్మెస్సీ తో పాటు నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్ట్ కి అప్లై చెయ్యచ్చు. బాటనీ, మైక్రోబయోలజీ, ఎన్వీరాన్మెంటల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ లో ఎమ్మెస్సీ చేసి నెట్ క్వాలిఫై అయిన వారు కూడా అప్లై చెయ్యచ్చు.

అదే రీసెర్చ్ అసోసియేట్ కి అయితే జువాలజీ/ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/బయో టెక్నాలజీ/ఎన్వీరాన్మెంటల్ సైన్స్/లైఫ్ సైన్సెస్ లో PhD చేసిన వారు అర్హులు. జూనియర్ రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 31 వేలు, రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 54 వేలు వేతనం చెల్లించనున్నారు.

బయోడేటాతో పాటు విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను జులై 31లోగా [email protected] మెయిల్ పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలని https://www.drdo.gov.in/sites/default/files/career-vacancy-documents/DRL_RAJRF17062021.pdf లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news