విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. బెస్ట్ స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంలు మీకోసం…!

-

మంచి స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంలు విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. అలాగే కొంత ఫీజుతో కొంత కోర్సు లేదా ప్రోగ్రామ్‌ ని అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది సతమతం అవుతూ వుంటారు. ఇలా ఇబ్బంది ప‌డే వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు తెలుసుకోండి.

బీవైపీఎస్ స‌శ‌క్త్ స్కాల‌ర్‌షిప్‌:

బీఎస్ఈఎస్ య‌మునా ప‌వ‌ర్‌లిమిటెడ్ ఢిల్లీలోని ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో అండ‌ర్ గ్రాడ్య‌యేట్ ప్రోగ్రామ్‌లో చివరి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థుల నుంచి స్కాల‌ర్‌షిప్ పొందాల‌నుకొనే వారి నుంచి సంస్థ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కేవలం భార‌తీయ విద్యార్థులకు మాత్ర‌మే.. ఢిల్లీలో నివ‌సిస్తూ ఉండాలి. అలానే అండ‌ర్ గ్రాడ్యుయేట్‌లో చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారికి మాత్ర‌మే ఇది.

ముందు విద్యా సంవ‌త్స‌రంలో 55శాతం మార్కులు పొంది ఉండాలి. అలానే కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 ల‌క్ష‌లు మించి ఉండ‌కూడ‌దు. https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అప్లై చేసుకోచ్చు.

ఎన్ఎస్‌పీ సెంట్ర‌ల్ సెక్ట‌ర్ స్కాల‌ర్‌షిప్‌:

ఈ స్కాలర్ షిప్ ని పొందాలంటే ప‌న్నెండో త‌ర‌గ‌తి పూర్తి చేసుకొన్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు ప‌న్నెండో త‌ర‌గ‌తి పూర్తి చేసుకొని మంచి మార్కులు సాధించి ఆర్థికంగా చ‌ద‌వ‌లేని స్థితిలో ఉన్న‌వారు ఈ స్కాల‌ర్షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 12వ త‌ర‌గ‌తిలో 80 శాతం మార్కులు సాధించి ఉండాలి.అభ్యర్థులు AICTE, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థ‌ల క‌ళాశాల‌లో కోర్సును అభ్య‌సిస్తూ ఉండాలి.

ఇత‌ర స్కాల‌ర్‌షిప్‌లు పొందే వారు అర్హులు కారు. అలానే కుటంబ ఆదాయం రూ.8ల‌క్ష‌లు మించి ఉండ‌కూడ‌దు. అవార్డులు,రివార్డులు సంవ‌త్స‌రానికి రూ.10,000ల నుంచి రూ.20,000 వ‌ర‌కు ఉండొచ్చు. https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction ను సంద‌ర్శించి అప్లై చెయ్యచ్చు.

టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్:

దీనికి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివే విద్యార్థులు అర్హ‌లు. అలానే గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేవారు కూడా అర్హులు. ఇది భారతీయుల‌కు మాత్ర‌మే వ‌ర్తించే స్కాల‌ర్‌షిప్. 12వ త‌ర‌గ‌తి చ‌దివేవారు, పాల్‌టెక్నిక్‌, డిప్ల‌మా, అండ‌ర్‌గ్రాడ్యుయేట్లు అప్లె చేసుకోవ‌చ్చు.

అయితే అకాడ‌మిక్‌లో 60శాతం మార్కులు వ‌చ్చి ఉండాలి. అలానే కుటంబ వార్షిక ఆదాయం రూ.4ల‌క్ష‌లు మించి ఉండ‌కూడ‌దు. అలానే కోవిడ్ 19 ఏ రకంగా ఇబ్బంది ఎలా పడ్డారు అని త‌గిన ధ్రువ‌ప‌త్రాలు స‌మ‌ర్పించాలి. అలానే ప‌రీక్ష ఫీజులో, ట్యూష‌న్‌ఫీజులో 80శాతం వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్ భ‌రిస్తుంది. https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌ నుండి అప్లై చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news