నెల్లూరు జిల్లా ఏసీఎస్ఆర్‌లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లాలోని ఏసీఎస్ఆర్ ప్ర‌భుత్వ వైద్య కళాశాల‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జ‌న‌ర‌ల్ మెడిస్‌, పీడియాట్రిక్స్‌, టీబీసీడీ, సైకియాట్రిక్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ వంటి వివిధ విభాగాల్లో వున్నా ఖాళీలని భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఇందులో 30 పోస్టులు భర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా మాత్రమే. ఇక పూర్తి వివరాలని చూస్తే… ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొన్న అభ్య‌ర్థులు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగాల్లో స్పెష‌లైజేష‌న్ పీజీ, డీఎన్‌బీ పూర్తి చేసి ఉండాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. జ‌న‌ర‌ల్ మెడిసిన్‌ 5, పీడియాట్రిక్స్‌ 4, టీబీసీడీ 1, డీవీఎల్‌ 1, సైక్రియార్టి 1, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ 4, అర్థోపెడిక్స్‌ 2, అప్త‌మాల‌జీ 1, ఓబీజీ 3, రేడియో-డ‌యోగ్న‌సిస్‌ 3, అనెస్తియాల‌జీ 5.

ఈ పోస్టుల‌కు అక్టోబ‌ర్ 2, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి సమయం వుంది. అభ్య‌ర్థుల‌ను పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పీజీ థియ‌రీ ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి..అనంత‌రం అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూని పెట్టి సెలెక్ట్ చేయనున్నారు. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ త‌దిత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సంద‌ర్శించాలి.

https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/

 

Read more RELATED
Recommended to you

Exit mobile version