హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో జాబ్స్.. పూర్తి వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబయి రిఫైనరీలో ఈ పోస్టులు ఖాళీగా వున్నాయి.

60 అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆపరేటర్ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టుల కి అప్లై చెయ్యాలంటే 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. అలానే బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, బేసిక్‌ ఫైర్ ఫైటింగ్ కోర్సు సర్టిఫికేట్‌ కూడా ఉండాలి.

హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పక ఉండాలి. ఇక అభ్యర్ధుల వయసు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు ఫిబ్రవరి 25, 2023 ఆఖరి తేదీ. రూ.590లు అప్లికేషన్‌ ఫీజు కిందా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు కి ఫీజు లేదు. పోస్టుల వివరాలని చూస్తే..

అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్ పోస్టులు: 30, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్ పోస్టులు: 7, అసిస్టెంట్ ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆపరేటర్ పోస్టులు: 18, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 5 ఖాళీగా వున్నాయి. పూర్తి వివరాలని https://www.hindustanpetroleum.com/job-openings లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?