మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన మధ్యప్రదేశ్ లోని భారత్వ రంగ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫిల్డ్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..
నార్తర్న్ కోల్‌ఫిల్డ్స్ లిమిటెడ్ లో మొత్తం 405 మైనింగ్ సిర్దర్, సర్వేయర్ పోస్టులు వున్నాయి. ఇక అర్హత వివరాలని చూస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి కానీ డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సును పూర్తి చేసుండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే..
అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ 22, 2022వ తేదీ వరకే అవకాశం వుంది. దరఖాస్తు ఫీజు గురించి చూస్తే.. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1180లు అప్లికేషన్ ఫీజు కింద కట్టాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్/డెవలప్‌మెంటల్ అభ్యర్ధులకు ఫీజు లేదు. ఇక సాలరీ విషయానికి వస్తే.. పోస్టుని బట్టీ జీతం వుంది. మైనింగ్ సిర్దర్ పోస్టులకైతే రూ.31,852లు, సర్వేయర్ పోస్టులకు రూ.34,391ల జీతం ఇస్తారు. పూర్తి వివరాలను http://www.nclcil.in/ లో చూడచ్చు.