మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 9 యూనిట్లలో ఒకటి అయిన బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ ఈ అవకాశాన్ని ఇస్తోంది. జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోచ్చు. మొత్తం 81 ఖాళీలు వున్నాయి. వయస్సు వచ్చేసి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, శాలరీ, ఎంపిక విధానం వివరాలని కూడా చూద్దాం. అర్హతలు చూస్తే.. డిప్యూటీ టెక్నాలజీ, పెయింట్ టెక్నాలజీ, పర్ఫేస్ కోటింట్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లిథో ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్, ఆఫ్‌సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్ లేదా ఎలక్ట్రో ప్లాటింగ్ లో ఐఐటీ సర్టిఫికేట్ ఉండాలి.
అలానే ఎన్‌సీబీటీ నుంచి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా తప్పని సరిగా ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్ మే లో పరీక్ష ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు రూ.600 . అదే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు రూ.200. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 28, 2022 అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. https://bnpdewas.spmcil.com/Interface/Home.aspx లో పూర్తి వివరాలని చూడాలి.