మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (AIIMS) ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ పోస్టులకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఫ్యాకల్టీ (Group A) పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసారు. దీనిలో ప్రొఫెసర్, లెక్చరర్ లాంటి పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు ఆరే వున్నాయి. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 14 చివరి తేదీ. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవాళ్లే దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. లెక్చరర్ ఇన్ నర్సింగ్ పోస్టుకు రూ.1,23,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.2,15,900 వేతనం లభిస్తుంది. లెక్చరర్ ఇన్ నర్సింగ్ పోస్టుకు రూ.67,700 బేసిక్ వేతనంతో రూ.2,08,700 మొత్తం వేతనం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ.1,000.

వయస్సు విషయంలోకి వస్తే.. 50 నుంచి 58 ఏళ్లు ఉండాలి. ఇక పోస్టుల వివరాలని చూస్తే…ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 1, లెక్చరర్ ఇన్ నర్సింగ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ -5. ఇది ఇలా ఉంటే ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్ పోస్టుకు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. అలానే నర్స్ అండ్ మిడ్‌వైఫ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. తప్పక 10 ఏళ్లు అనుభవం ఉండాలి.

లెక్చరర్ ఇన్ నర్సింగ్ పోస్టుకు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. మిడ్‌వైఫ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నర్సింగ్‌లో రెండేళ్ల అనుభవంతో పాటు మొత్తం ఐదేళ్ల అనుభవం ఉండాలి. పూర్తి వివరాలని https://aiimsmangalagirinursing.cbtexam.in/ వెబ్‌సైట్ లో చూసి అప్లై చేసుకోచ్చు.