ప్రసార భారతి లో పోస్టులు.. వివరాలివే..!

మీరు ఏదైనా మంచి అవకాశం కోసం చూస్తున్నారా..? అయితే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చేమో చూడండి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. హైదరాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 

jobs in prasar bharati

అందుకే నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దీని ద్వారా 40 స్ట్రింగర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇది ఇలా ఉంటే కాంట్రాక్టు కాల ప‌రిమితి రెండేళ్లు ఉంటుంది. ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న స్ట్రింగ‌ర్‌లు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అర్హత, అనుభవం వంటి వివరాలని ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్ http://prasarbharati.gov.in/pbvacancies ను చూసి తెలుసుకోచ్చు. దరఖాస్తుకు ఆఖరి తేదీ 30.09.2021.

రామాంతపూర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చు. దరఖాస్తు రుసుము వెయ్యి రూపాయిలు. 45 ఏళ్ల వయసు మించరాదు. ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది చూస్తే.. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు. ఇక ఎలా అప్లై చెయ్యాలి అనేది చూస్తే.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://prasarbharati.gov.in/pbvacancies/ ను సంద‌ర్శించాలి. నెక్స్ట్ నోటిఫికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. నోటిఫికేష‌న్‌లో అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకొని. ఫాం నింపాలి. ద‌ర‌ఖాస్తును హైద‌రాబాద్‌ లోని ప్ర‌సార‌భార‌తీ కార్యాల‌యానికి పోస్టు ద్వారా కాని లేదా నేరుగా వెళ్లి అందించ‌వ‌చ్చు.