ఢిల్లీ యూనివర్సిటీలో ఖాళీలు.. రూ.1,82,400ల జీతం..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధి లోని కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. దీనిలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వున్నాయి.

ఇక పోస్టుల వివరాలు చూస్తే.. ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, మేనేజ్‌మెంట్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, టూరిజం మొదలైన విభాగాల్లో ఈ పోస్టులు వున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ఎంఫిల్‌/పీహెచ్‌డీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. యూజీసీ నెట్‌/సీఎస్‌ఐఆర్‌లో అర్హత సాధించి ఉండాలి.

అలానే అనుభవం కూడా తప్పక ఉండాలి. ఈ పోస్టుల కి ఆన్ లైన్ విభాగం లో అప్లై చేసుకోవాల్సి వుంది. ఏప్రిల్‌ 15, 2023వ తేదీలోపు అప్లై చేసుకోండి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు మినహాయింపు వుంది. రూ.57,700ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలని https://www.du.ac.in/ లో చూడచ్చు.