ఈ బడ్జెట్‌లో బేసిక్ ఎగ్జమ్షన్ లిమిట్‌ని ప్రస్తుత రూ.2.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచవచ్చు. ఇప్పటికే ఉన్న పరిమితి చాలా సంవత్సరాలుగా మారలేదు. ద్రవ్యోల్బణం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పెంపుదల వలన సుమారుగా 7 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందవచ్చు. జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.
డొమెస్టిక్ కంపెనీలు అందజేసే డివిడెండ్లపై పన్ను 20 శాతానికి పరిమితం చేయాలని ట్యాక్స్ పేయర్స్ కోరుతున్నారు. IT చట్టం ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కంపెనీల విషయంలో ఆదాయానికి రెట్టింపు పన్ను విధిస్తున్నారు. ముందుగా కంపెనీలు కార్పొరేట్ పన్నును చెల్లించి, ఆపై వాటాదారులు డివిడెండ్‌లపై పన్ను చెల్లిస్తారు. రెసిడెంట్ ఇండివిడ్యువల్ షేర్ హోల్డర్ విషయంలో, డివిడెండ్లపై పన్ను 35.88% వరకు ఉంటుంది. మరోవైపు నాన్-రెసిడెంట్లు డివిడెండ్‌పై 20% (ప్లస్ సర్‌ఛార్జ్, సెస్) పన్ను చెల్లించాలి. దీన్ని తర్వాత డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ద్వారా 5%-15%కి తగ్గుతుంది.
రెసిడెంట్ షేర్ హోల్డర్‌లకు డొమెస్టిక్ కంపెనీలు పంపిణీ చేసే డివిడెండ్‌లపై పన్ను 20%కి పరిమితం కావాలని కోరుతున్నారు. డబుల్ టాక్సేషన్ క్యాస్కేడింగ్ ప్రభావాన్ని తగ్గించడం, వ్యక్తిగత వాటాదారులకు ఉపశమనం అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు.