యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈరోజుల్లో యోగా చెయ్యడం మరీ మంచిది.. మందులు లేని రోగాలు వస్తున్నాయి. దాంతో జనాలు పాత కాలం ఆహార పదార్ధాలను తింటున్నారు.. అంతేకాదు, యోగా, ధ్యానం ల వైపు మొగ్గు చూపుతున్నారు..అందుకే వీధికి ఒక యోగా సెంటర్ ఉంది. యోగా చెయ్యడానికి వయస్సు తో సంబంధం లేదు..శరీరం సహకరిస్తే ఎవరైనా చెయ్యొచ్చు అని ఈ మధ్య చాలా మంది నిరూపించారు..తాజా 90 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న ఓ తాత ఆసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
అదిలాబాద్ జిల్లాకు చెందిన అక్కు బాలయ్య..ఆయన వయస్సు 91 ఏళ్ళు..వేకువజామున 4 గంటలకు నిద్ర లేచి రెండు కిలోమీటర్ల నడక, ఆ తర్వాత గంటపాటు యోగాసనాలు చేయడం ఆయన దినచర్య. ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన వివిధ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. బీపీ, మధుమేహం లాంటి ఎలాంటి రుగ్మతలు లేని బాలయ్య ఇప్పటివరకు ఆసుపత్రి వైపు చూడలేదు. కంటిచూపు కూడా బాగుంది.
బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించేవారు. భార్య ఈలమ్మ మరణించాక ఆయన 2016 నుంచి ఆదిలాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఇప్పటికీ ఆయన దుస్తులు కుడుతున్నారు. నిత్యం యోగా సాధన చేస్తే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని బాలయ్య చెబుతున్నారు..నిజంగా ఇలాంటి వాళ్ళు అందరికి ఆదర్శం..నేటి నుంచి ఉదయం సాయంత్ర సమయాల్లో వీలు వున్నప్పుడు యోగా చెయ్యండి ఆరొగ్యాన్ని పదిలం చేసుకొండి.