ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతం.. తెలంగాణ సాధనోద్యమం : కేటీఆర్

-

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ.. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతం.. ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికం.. తెలంగాణ సాధనోద్యమం అని తెలిపారు.

“మన అమరుల ఆశయం.. కేవలం స్వపరిపాలన మాత్రమే కాదు… సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడం అని కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన.. సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి… తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించామని తెలిపారు. అమరుల ఆశయాలే స్ఫూర్తిగా… ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా.. తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లుగా.. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే.. మహాయజ్ఞం మహోద్యమంగా సాగిందనడానికి తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే నిలువెత్తు నిదర్శనం అని ట్వీట్ చేశారు.

‘భారత స్వాతంత్య్ర పోరాటయోధుల కలలు 75 ఏళ్లు దాటినా నెరవేరని సందర్భమిది.. కానీ తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేర్చి వచ్చే వందేళ్లకు బలమైన పునాది వేసిన సంకల్పమే యావత్ దేశానికి.. తెలంగాణ నేర్పుతున్న పరిపాలనా పాఠం ప్రతిజ్ఞచేస్తున్నం… హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకస్థూపం – జ్వలించే దీపం సాక్షిగా త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటాం నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితం అవుతాం.. మాటిస్తున్నం… లక్ష్యం కోల్పోయిన భారత దేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతాం జోహార్.. తెలంగాణ అమరవీరులకు.. జై తెలంగాణ జై భారత్’ అంటూ కేటీఆర్ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version