బడ్జెట్​కు ముందు.. రాష్ట్రపతితో నిర్మలా సీతారామన్ భేటీ

-

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ట్యాబ్‌తో నిర్మలమ్మ బృందం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి బృందం.. బడ్జెట్‌ గురించి రాష్ట్రపతికి వివరించారు.

అక్కడి నుంచి పార్లమెంట్‌కు బయల్దేరనున్నారు. అక్కడ కాసేపట్లో కేంద్ర మంత్రివర్గంతో నిర్మలా సీతారామన్‌ సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news