బ్రేకప్ కి ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయాలు..

-

రిలేషన్ షిప్ ఎంత రోమాంటిక్ సాగుతున్నా మధ్యలో వచ్చే ఎగుడు దిగుడు వ్యవహారాల కారణంగా చివరి దాకా సాఫీగా సాగే అవకాశం ఉందరికీ ఉండదు. అలాంటప్పుడు మధ్యలోనే బంధాన్ని బ్రేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చివరి సారిగా మీ భాగస్వామికి ఒక అవకాశం ఇవ్వాలి. అలాగే మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.

భాగస్వామిలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశం ఏమిటి?

పరిచయం అయిన కొత్తలో మీ భాగస్వామిలో ఈ అంశాలు మీకు బాగా  నచ్చాయి. ఆ అంశాలు ఇప్పుడు వారిలో కనిపించట్లేదా? అందుకే మీరు బ్రేకప్ చెప్పాలని అనుకుంటున్నారా? లేదా మీరు మారారా అన్నది తెలుసుకోండి.

మీ ప్రాధాన్యత ఏమిటి?

మీ భవిష్యత్తులో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు? ఏ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు? ఆ ప్రాధాన్యతలకి అనుకూలించే అంశాలు మీ భాగస్వామిలో కనిపిస్తున్నాయా? అనేది చూసుకోవాలి.

అవతలి వారు మీతో ప్రేమగా ఉంటున్నారా?

బంధంలో ప్రేమ లేనపుడు అది ఎక్కువకాలం నిలబడదు. అవతలి వారు మీ పట్ల ప్రేమగా లేకపోతే మీరు కూడా అవతలి వారిపై ప్రేమ చూపలేరు. ముందు మీరు ప్రేమగా ఉంటున్నారా చెక్ కేసుకోండి.

మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా?

ఒక్కోసారి ఎంత ప్రేమించుకున్నా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కనిపించకుండా పోతుంది. మీరు చెప్పేది అర్థం చేసుకోవడం లేదంటే సమస్య మీరు అర్థం అయ్యేలా చెప్పడం లేదా అనేది చూసుకోవాలి.

నా విషయంలో ఎక్కువ పని చేయాలా?

కొన్ని సార్లు ప్రేమలో ఎలాంటి తేడా లేకపోయినా, మీ మీద ప్రేమ ఎక్కువయ్యి, ఒంటరిగా గడపాలన్న ఆలోచనలు పెరిగి బ్రేకప్ వల్లే అది సాధ్యమయ్యే అవకాశం ఉందని అనిపించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news