వైరల్‌ వీడియో : కరోనా… కరోనా 20 రూపాయలే.. దేన్నైనా అమ్మేయగలరు..

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. లక్షల మందికి ఈ వ్యాధి రోజుల వ్యవధిలో సోకుతూ నరకం చూపిస్తుంది. చైనాలో పుట్టిన ఈ వ్యాధి ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరించింది. గల్ఫ్ దేశాలకు సహా ఇటలీ, ఆఫ్రికా దేశాలకు కూడా ఇది విస్తరించింది. ఇటలీలో దాదాపు 3 వేల కేసులు నమోదు అయ్యాయి. ఆరు వందల మంది వరకు మరణించారు. ఇక మన దేశంలో కూడా దీని ప్రభావం ఉంది.

ఇది పక్కన పెడితే కరోనా దెబ్బకు ఇప్పుడు ప్రజలు మాస్క్ ల కోసం పోటీ పడుతున్నారు. ఆస్పత్రుల్లో, మెడికల్ షాపుల్లో అన్ని చోట్లా కరోనా మాస్క్ ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీనితో వ్యాపారులు కూడా మాస్క్ లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అది అలా ఉంటే ఒక వ్యక్తి కరోనా కరోనా అంటూ జనసమ్మర్ధ ప్రాంతంలో మాస్క్ లు అమ్ముతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది.

అనకూడదు గాని మన దేశంలో ఏ చిన్న పరిస్థితి వచ్చినా సరే చిన్న చిన్న వ్యాపారులు చక్కగా క్యాష్ చేసుకుంటారు. రాక రాక వచ్చిన అవకాశం అంటూ చెలరేగిపోతు ఉంటారు. జనాల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే వారు కొందరు అయితే జనాల అవసరాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు మరికొందరు, జనాల భయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఇంకొందరు. జనం భయపడితే దాని ఆధారంగా జరిగే మార్కెట్ అంతా ఇంతా కాదు.

ఇప్పుడు కరోనా విషయంలో కూడా అంతే… జనసమ్మర్ధ ప్రాంతంలో ఒక వ్యక్తి కరోనా కరోనా… 20 రూపాయలే అంటూ అరుస్తూ మాస్క్ లు అమ్ముతున్నాడు. కాని అతను మాత్రం మాస్క్ పెట్టుకోలేదు. కొనే వాళ్ళు కొంటుంటే… అవసరం లేని వాళ్ళు అతన్ని చూసి నవ్వుతున్నారు. అతను ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా కరోనా మాస్క్ లు అమ్మడం చూసి సోషల్ మీడియా ఫిదా అయిపోయింది.

దీనిపై ఇప్పుడు ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. కరోనా మనుషులకు సోకుతుంది… అండి మీరు కూడా మనిషే కాబట్టి మాస్క్ పెట్టుకుని అమ్మండి, లేకపోతే మీకు కరోనా వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే… వ్యాపారం బాగానే చేసుకుంటున్నారు గాని ప్రకటన చేసుకోవడం మాత్రం రావడం లేదు మీకు, మాస్క్ పెట్టుకుని అమ్మితే ఎక్కువ మంది కొంటారు కదా…? అంటూ కామెంట్ చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news