కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

-

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా యువత, పిల్లల్లో కూడా కరోనా లక్షణాలు బయట పడుతున్నాయి. అనారోగ్య సమస్యతో బాధపడే వృద్ధులకు ప్రాణాంతకంగా మారుతోంది. వైరస్ తీవ్రత గణనీయంగా పెరగడంతో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం.. కరోనా వైరస్ పెద్దవాళ్లు, వృద్ధులతో పోల్చితే యువతల్లోనే ఎక్కువగా వ్యాప్తి జరుగుతున్నట్లు తేలింది. 65 శాతం మంది బాధితుల్లో 45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల వెల్లడించారు.

కరోనా-యువత
కరోనా-యువత

గతేడాదితో పోల్చితే కరోనా లక్షణాలు ఈ సారి చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కరోనా బాధితులకు నోరు పొడిబారడం, అజీర్తి సమస్య, వికారం, విరేచనాలు, తలనొప్పి, పెదాలు నీలి రంగులో కనిపించడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముంబైలోని పీడీ హిందూజా నేషనల్ హాస్పిటల్ కన్సట్టెంట్.. 12 నుంచి 15 ఏళ్ల తక్కువ వయసు ఉన్న పిల్లలపై కరోనా ప్రభావం ఎంత వరకు ఉందనే విషయంపై పరిశోధన నిర్వహించారు. మునుపటి లక్షణాల కంటే ఈ సారి పిల్లల్లో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని కనుగొన్నారు.

భారతదేశంలో కరోనా ప్రభావాన్ని తెలుసుకోవడానికి మరింత డేటా అవసరమని వైరాలజిస్ట్ షాహిద్ జమీన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. 8-14 ఏళ్ల వయసు పిల్లల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో ఈ సంఖ్య ఎక్కువ ఉందన్నారు.

కరోనా కొత్త లక్షణాలు..

హార్వర్డ్ హెల్త్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. పెద్దవాళ్లు, పిల్లలు, యువతలో కనిపించే లక్షణాలు భిన్నంగా ఉన్నాయన్నారు. పిల్లల్లో 103-104 డిగ్రీల జ్వరంతో బాధపడుతారని, ఈ జ్వరం 4-5 రోజులపాటు ఉంటుందన్నారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేస్తుండాలని తెలిపారు. దీర్ఘకాలిక జలుబు, ఊపిరితిత్తుల సమస్య, న్యూమోనియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. పెదవులు ఎర్రబడటం, పెదవులు పగలటం, దుద్దర్లు, చిరాకు, నిద్రలేమి, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news