మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్..ఇక దక్షిణాదిలో కూడా ?

Join Our COmmunity

మాస్క్ ధరించకపోతే ఫైన్ తప్పదంటున్నారు. మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వస్తే భారీగా ఫైన్ కట్టాలి..ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఫైన్‌ లు… పరిస్థితి చేయిజారితే దక్షిణాదికీ వచ్చే అవకాశం ఉంది.

కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమౌతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఆంక్షలు కఠినంగా కొనసాగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోవటం లేదు. దీంతో మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మాస్క్ ధరించని వారికి విధించే జరిమానా రూ. 500 నుంచి రూ.2000కు పెంచారు.

హిమాచల్ ప్రదేశ్‌ లోని కులూ జిల్లాలో మాస్క్ ధరించని వారికి రూ. 5 వేలు జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లో కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించని వారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు. ఇక హరియాణా విషయానికొస్తే, ఇక్కడి గురుగ్రామ్‌ లో మాస్క్ ధరించనివారికి రూ. 2,500 జరిమానా విధిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 500 జరిమానా విధిస్తున్నారు. పంజాబ్లో మాస్క్ ధరించనివారికి ఇంతవరకూ రూ 200 జరిమానా విధిస్తుండగా, దానిని రూ. 500కు పెంచారు.

రాజస్థాన్లో మాస్క్ ధరించనివారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు. మహారాష్ట్రలోని వివిధ పట్టణాలలో ఒక్కోవిధంగా జరిమానా విధిస్తున్నారు. పూణేలో బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. గుజరాత్లో మాస్క్ ధరించని వారి నుంచి వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు. గుజరాత్ అధికారులు జూన్ 15 నుంచి ఇప్పటి వరకు మాస్క్లు ధరించని 26 లక్షల మంది ప్రజల నుంచి రూ.78 కోట్లు జరిమానా వసూలు చేశారు. అత్యధికంగా అహ్మదాబాద్లో ప్రతి నిమిషానికి 120 మందికి జరిమానా విధించారు. అధికారులు నిరంతరం సూచనలు చేస్తున్నప్పటికీ చాలామంది ప్రజలు ఇప్పటికీ మాస్క్లు ధరించట్లేదు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news