అత్యధిక కరోనావైరస్ రికవరీలను భారత్ నమోదు చేసింది. భారత్ ని అధిగమించి నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారతదేశం ఇప్పటివరకు 43,96,399 కోవిడ్ -19 రికవరీలను నమోదు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం అని అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ నుండి 93,000 మందికి నిన్న ఒక్క రోజే కోలుకోవడం సరికొత్త రికార్డ్.
ఒకే రోజు 86,961 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. భారత్ లో కరోనా కేసులు 55 లక్షలకు చేరుకున్నాయి. రికవరీ రేటు 80.12 శాతం గా ఉంది. మొత్తం రికవరీల పరంగా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొంది. “వరుసగా 3 వ రోజు భారతదేశం 90,000 కంటే ఎక్కువ రికవరీలను నమోదు చేసినట్టు చెప్పింది.