సాయం చేయడానికి మూడు వేల వీడియోలు చేసిన సింగర్..

కరోనా వచ్చి అందరి జీవితాలని ఛిన్నాభిన్నం చేసింది. లాక్డౌన్ కారణంగా దుయోగాలు పోయాయి. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలామంది నిరుపేదల అవసరాలు తీర్చడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సోనూసూద్ పేరు మార్మోగిపోయింది. వలస కూలీలని ఇంటికి చేర్చడంలో ఎంతో సహాయం చేసిన సోనూసూద్ హెల్పింగ్ స్టార్ గా మారాడు. ఐతే సింగర్ చిన్మయి తనవంతుగా లాక్డౌన్ బాధితులకి సాయం అందించింది.

అందుకోసం ఆమె ఎంచుకున్నపద్దతి చాలా కొత్తగా ఉంది. సింగర్ చిన్మయి వాయిస్ తో వీడియోలు చేసి కావాల్సిన వాళ్ళకి అందించింది. అలా అందుకున్న వాళ్ళు డబ్బు కట్టాల్సి ఉంటుంది. అలా తమకు కావాల్సిన సమాచారాన్ని చిన్మయి వాయిస్ లో ఇప్పించుకున్నందుకు మొత్తంగా 85లక్షల రూపాయలు వచ్చాయట. ఇప్పటి వరకు 3000వీడియోలకి పైగా చేసిందట. ఈ డబ్బు మొత్తాన్ని లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నవారికి అందించనుందట.