ఫ్యాక్ట్ చెక్: భేటీ బచావో భేటీ పడావో కింద ఉద్యోగాలు, ల్యాప్టాప్స్, ఫోన్స్ ప్రభుత్వం ఇస్తోందా..? నిజమెంత..?

-

ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త మనకి కనబడుతూనే ఉంటుంది. చాలా మంది ఈ ఫేక్ వార్తలను నిజమని నమ్మి లింక్ మీద క్లిక్ చేయడం లేదా ఇతరులకి ఫార్వర్డ్ చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా సోషల్ మీడియాలో కనిపించిన వార్త ముందు ఇతరులకి పంపించాలన్నా.. తిరిగి మీరు దానికి రెస్పాండ్ అవ్వాలన్న అది నిజమో కాదో ముందు తెలుసుకోవాలి.

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది. ఇక దాని కోసం చూస్తే… భేటీ బచావో భేటీ పడావో క్యాంపైన్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ అడ్వర్టైజ్మెంట్ లో ప్రభుత్వం ఉద్యోగాలు, ల్యాప్టాప్లు మరియు మొబైల్ ఫోన్లు ఇస్తోందని ఈ స్కీం కింద వీటిని పొందొచ్చని ఉంది. అదే విధంగా మీ యొక్క వివరాలని ఎస్ఎంఎస్ పంపించాలని అప్పుడు ఈ ఆఫర్ ని మీరు పొందొచ్చని ఉద్యోగం కూడా మీకు వస్తుంది అని అందులో ఉంది.

एक विज्ञापन पर फेक शब्द की मोहर जिसमें दवा किया गया है की 'बेटी बचाओ, बेटी पढ़ाओ' अभियान के तहत सरकार द्वारा नौकरियाँ, लैपटॉप और मोबाइल प्रदान किए जा रहे हैं

అయితే నిజంగా బేటి బచావో బేటీ పడావో స్కీమ్ కింద ప్రభుత్వ ఉద్యోగాలు, ల్యాప్టాప్లు, ఫోన్లు ఇస్తుందా…? దీనిలో నిజమెంత అనేది చూస్తే.. ఇది కేవలం ఫేక్ వార్త అని ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. దీనిపై PIB కూడా స్పందించింది.

ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఇది ఫేక్ వార్త అని చెప్పడం జరిగింది. అలానే ఇటువంటి ఫేక్ వార్తలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇలాంటివి ఏమైనా మీకు కనపడితే అవి నిజమో కాదో తెలుసుకొని అప్పుడు మాత్రమే స్పందించమని చెప్పింది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలని నమ్మదు ఫార్వర్డ్ చెయ్యొద్దు. వీటివల్ల నష్టపోవాల్సి ఉంటుందని గ్రహించాలి.

Read more RELATED
Recommended to you

Latest news