ఫ్యాక్ట్ చెక్: ఈ స్కీమ్ కింద నాలుగు వేలు వస్తున్నాయా..? నిజం ఎంత..?

మనం సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్తలని తరచూ చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది మనమే. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

 

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది. అయితే మరి అది నిజమా..? కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఒక మెసేజ్ సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది.

ప్రభుత్వం యువతకు నాలుగు వేల రూపాయలు ఇస్తోందని ఆ మెసేజ్ లో ఉంది. పైగా వైరల్ అవుతున్న మెసేజ్ లో నాకు కూడా నాలుగు వేల రూపాయలు లభించాయని.. లింక్ పై క్లిక్ చేసి డబ్బులు పొందండి అని కూడా అందులో రాసి ఉంది. అయితే మరి నిజంగా డబ్బులు వస్తున్నాయా లేదా అనేది చూస్తే…ఈ మెసేజ్ లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం గా తెలుస్తోంది.

ప్రధానమంత్రి రంబన్ సురక్ష యోజన పథకం కింద యువతకి ప్రభుత్వం 4000 ఇస్తుందని వైరల్ అవుతున్న వార్తలో ఉంది పైగా దీని పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని ఫామ్ నింపాలని ఉంది. చదివే వారికి నమ్మకం కలిగించడానికి నాకు కూడా నాలుగు వేల రూపాయలు వచ్చాయని ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని ఉంది. అయితే నిజానికి ఇది ఫేక్ వార్త ఇందులో ఏ మాత్రం నిజం లేదు ప్రధానమంత్రి నాలుగు వేల రూపాయలను యువతకు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని పీఐబీ కూడా చెప్పేసింది. ఈ వైరల్ అవుతున్న పోస్ట్ ని పరిశీలించి వట్టి ఫేక్ వార్త అని చెప్పింది ఇలాంటి ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా మనమే మోసపోతాం.