ఫ్యాక్ట్ చెక్: నిజంగా కనపడే ఈ నకిలీ వెబ్ సైట్స్ తో జాగ్రత్త…ఫేక్ వెబ్సైట్స్ ఫుల్ లిస్ట్ ..!

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్య నకిలీ వెబ్ సైట్స్ ఎక్కువై పోతున్నాయి. ఒకటికి పది సార్లు వెబ్ సైట్ నిజమా కాదా అని చూసుకోవాలి. ఫేక్ సైట్స్ వలన ప్రమాదంలో పడే అవకాశం వుంది. కనుక జాగ్రత్తగా వుండండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ నకిలీ వెబ్సైట్ల లిస్ట్ ఇచ్చింది. వాటిని ఇప్పుడు చూద్దాం. ఇవి చూడ్డానికి జెన్యూన్ గా కనపడతాయి కానీ ఫేక్ ఏ.

నకిలీ వెబ్సైట్ల ఫుల్ లిస్ట్:

full list of fraudulent websites named by PIB:

1) http://centralexcisegov.in/aboutus.php

2) https://register-for-your-free-scholarship.blogspot.com/

3) https://kusmyojna.in/landing/

4) https://www.kvms.org.in/

5) https://www.sajks.com/about-us.php

6) https://register-form-free-tablet.blogspot.com

7) https://nragov.online/

8) http://betibachaobetipadhao.in/

9) http://www.pibfactcheck.in/

ఉదాహరణకి లిస్ట్ లో వుండే ఎనిమిదవది చూస్తే… http://betibachaobetipadhao.in/ లింక్ వుంది అయితే దీనిలో “s” అనేది లేదు. కేవలం “http” వరకే వుంది. కానీ ”s” అంటే ‘secure’ అని. లేదు కానీ ఇది సెక్యూర్ కాదు. కనుక లింక్ ని చూసుకోండి. అనవసరంగా నకిలీ వెబ్సైట్ల మీద క్లిక్ చేసి నష్టపోవద్దు. ప్రమాదంలో పడతారు.

Read more RELATED
Recommended to you

Latest news