సీఎం జగన్ కి లిక్కర్ మాఫియా తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఢిల్లీ లిక్కర్ స్కాం లో పట్టుబడ్డ శరత్ చంద్రారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు అని అన్నారు. శరత్ చంద్రారెడ్డి నుంచి సీఎం జగన్ కి ముడుపులు అందాయని ఆరోపించారు. 9 వేల కోట్లు శరత్ నుండి సీఎం జగన్ తీసుకున్నారని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు.
ఏపీ సిఐడి కి ఇది కనిపించడండం లేదా? అని ప్రశ్నించారు. విశాఖలో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. కేసుల నుంచి బయటపడడానికే సీఎం జగన్ ప్రధానికి సాగిల పడుతున్నారని అన్నారు. ఇక విశాఖలో కార్మికులను అరెస్టు చేయడం సరైనది కాదని మండిపడ్డారు రామకృష్ణ. ప్రజా సంఘాల నేతలను సైతం గృహనిర్బంధం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రిని జగన్ నిలదీయాలని సూచించారు.