సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.
Quoting an RTI, It is being claimed in a tweet that PM’s visit to Morbi cost ₹30 cr.#PIBFactCheck
▪️ This claim is #Fake.
▪️ No such RTI response has been given. pic.twitter.com/CEVgvWgGTv
— PIB Fact Check (@PIBFactCheck) December 1, 2022
మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడే చూద్దాం. ప్రధాని మోడీ మొర్బి కోసం రూ.30 కోట్లను ఖర్చు చేసారని.. ఇందులో వెల్కమ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫొటోస్ కోసం రూ.5.5 కోట్లు అయ్యాయని.. ఇంకా ఐదు కోట్లను 135 బాధితులకి ఇచ్చారని.. ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇచ్చారని అందులో వుంది. మరి ఇది నిజమేనా..? ఈ విషయానికి వస్తే.. ప్రధాని మోడీ మొర్బి కోసం రూ.30 కోట్లను ఖర్చు చేసారని వస్తున్నా వార్త ఫేక్ వార్త మాత్రమే. దీనిలో నిజం లేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. RTI కూడా అదే అంటోంది.కనుక అనవసరంగా నమ్మి మోసపోకండి.