ఫ్యాక్ట్ చెక్: ఎక్కువసేపు మాస్కులు ధరించడం వల్ల ఆక్సిజన్ సమస్యలు వస్తాయా..? ఇందులో నిజమెంత..?

-

  1. కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అనేక సమస్యలు తీసుకు వస్తోంది. చాలా మంది ఎన్నో రకాల సమస్యలకు గురవుతున్నారు. దేశమంతా కూడా ఈ సెకండ్ వేవ్ తో సతమతమవుతోంది. అయితే ఈ వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడం కి తప్పక మాస్కు ధరించాలి అన్న సంగతి అందరికి తెలిసిందే. అందరూ పాటిస్తున్నదే.

అయితే సోషల్ మీడియా లో కొన్ని పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ తరహాలోనే ఒక వార్త వైరల్ అవుతోంది. మాస్క్ ని ఎక్కువ సేపు ధరించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ స్థాయి లో వుంది ఆక్సిజన్ తగ్గిపోతున్నాయ్ అని అంటున్నారు.

ఫ్యాక్ట్ చెక్ :

అయితే ఇందులో ఎంత నిజం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్లు మరియు మెడికల్ ఎక్స్పర్ట్స్ కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి తప్పకుండా మాస్కు ధరించమని మరీ మరీ చెబుతున్నారు. అదే విధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ వేసుకునేటప్పుడు పూర్తిగా ముక్కు, మూతి క్లోస్ చేసుకోవాలి అని అంటున్నారు.

కళ్ల ద్వారా కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుందని ఫిజికల్ డిస్టెన్స్ తప్పక పాటించాలని అన్నారు. ఏది ఏమైనా మాస్కులు ధరించడం సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా ముఖ్యం. అయితే మాస్కులు ధరించడం వల్ల ఆక్సిజన్ ఉండదా అనే వాటిని విని ఆచరించడం మంచిది కాదు.

ఇటువంటి వాటిని పట్టించుకోవద్దు. మాస్కు తప్పక ధరించాలని. కరోనా వైరస్ రాకుండా ఉండడానికి ఇదే మన దగ్గర ఉండే ఆయుధం అని డాక్టర్లు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news