దిమ్మతిరిగే ట్విస్ట్: “పాన్ – ఆధార్” లింక్ చేయకపోతే అంత నష్టమా ?

-

మాములుగా భారతదేశానికి సంబంధించి ఆర్ధిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుండి మార్చ్ కి లెక్కిస్తారు. కాగా 2022 – 2023 ఆర్ధిక సంవత్సరం మరో నాలుగు రోజుల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ లోపు ఆధార్ మరియు పాన్ ను ఇంటర్ లింక్ చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇందుకోసం ఇప్పటికే చాలాసార్లు సమయాన్ని పెంచుతూ వచ్చింది. ఇక చివరికి మార్చ్ 31 వ తేదీ లోపు ఆధార్ ను పాన్ తో తప్పనిసరిగా లింక్ చేయాలి.

 

 

కాగా ఈ నాలుగు రోజులలో ఆధార్ పాన్ లింక్ చేయించుకోవాలి, అందుకోసం ముందుగా రూ. 1000 ను చెల్లించి లింక్ చేసుకోవాలి. ఈ నాలుగు రోజులలో కనుక ఈ ప్రక్రియను పూర్తి చేసుకోకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుండి మీ పాన్ పనిచేయదు. పాన్ లేకపోవడం వలన మీ బ్యాంకు అకౌంట్ లు క్లోజ్ అవుతాయి. ఇన్కమ్ రాక్ రిటర్న్ ను ఫైల్ చేయటం వీలు పడదు. ఒకవేళ చేయాల్సి వచ్చినా అధికంగా టీడీస్ కట్ అవుతుంది. కాబట్టి ఈ నాలుగు రోజులలోనే పాన్ ఆధార్ లింక్ ను పూర్తి చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version