వేసవికాలంలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అందుకనే చాలా మంది ఎయిర్ కండీషనర్ ని కొనాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎండకి తట్టుకోలేక ఏసీని కొనాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండా మీరు ఒక వీటి కోసం తెలుసుకోవాలి.
నిజానికి ఏసిని ముందు కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి. ఇన్వర్టర్ ఏసీ నాన్ ఇన్వర్టర్ ఏసి అంటే ఏమిటి అనే దాని గురించి ఈ రోజు చూద్దాం.
ఇన్వెర్టర్ ఏసి:
ఇన్వర్టర్ ఏసీ తక్కువ విద్యుత్తు ని వాడుకుంటుంది.
అలానే కంప్రెషర్ కు ఎంత పవర్ అవసరమో అంతే అది సరఫరా చేస్తుంది.
ఇన్వెర్టర్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ ఓల్టేజ్ విద్యుత్ కంట్రోలర్ గా పనిచేస్తుంది.
కంప్రెజర్‌కు అవసమైన మేర పవర్‌ను సరఫరా చేసి కూలింగ్‌పై కంట్రోల్ ఉండేలా ఇది హెల్ప్ అవుతుంది.
అలానే అవసరమైనంత మేర కూలింగ్, హీటింగ్ చేయగలిగే విభిన్న స్పీడ్స్ ఉండే కంప్రెజర్ ఇన్వర్టర్ ఏసీలో ఉంటుంది.
ఇన్వర్టర్ ఏసీలో కంప్రెజర్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది.
నాన్ ఇన్వర్టర్ ఏసీ:
దీనిలో ఒకే స్పీడ్ ఉండే కంప్రెజర్ మోటార్ ఉంటుంది. దీంతో ఫుల్ స్పీడ్‌లో రన్ అవడమో లేదా ఆగిపోవడమో ఈ రెండే జరుగుతాయి.
అలానే దీని స్పీడ్ మారుతూ ఉండదు.
అదే విధంగా కావాలనుకున్న టెంపరేచర్‌కు రాగానే కంప్రెజర్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. మళ్లీ కావాల్సినప్పుడు ఆన్ అవుతుంది.
ఇలా ఆన్, ఆఫ్ కావడం వల్ల విద్యుత్ ఎక్కువ ఖర్చవుతుంది.
ఈ ఏసీ ఎక్కువ పవర్‌ను వినియోగించుకుంటుంది.
నాన్-ఇన్వర్టర్ ఏసీల కంటే ఇన్వర్టర్ ఏసీల ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ కాలం మన్నుతాయి నాన్-ఇన్వర్టర్ ఏసీలు.
ఎక్కువ వినియోగించే వారికి ఇన్వర్టర్ ఏసీనే బెస్ట్. అప్పుడప్పుడే ఏసీ వాడేవారికి నాన్ ఇన్వర్టర్ ఏసీ చాలు.