తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన TSPSC గ్రూప్ 1 పరీక్షయే పేపర్లు లీక్ అవడంతో పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పేపర్ ను లీక్ చేసిన వారిని పట్టుకుని SIT అధికారుల బృందం విచారణ చేస్తున్నారు . కాగా ఎన్నో చర్చల అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆగిపోయిన పరీక్షలను జరపడానికి తేదీలను ఖరారు చేసింది. లేటెస్ట్ గా తెలిపిన షెడ్యూల్ ప్రకారం మే 8వ తేదీన ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఏఈఈ ఆన్లైన్ లో నిర్వహించేలా ప్లాన్ చేశారట.
అదే విధంగా మే 9వ తేదీన అగ్రికల్చర్ , మెకానికల్ ఏఈఈ పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తారట. ఇక మిగిలిన సివిల్ ఏఈఈ పరీక్షను మే 21వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ప్రకటనతో అభ్యర్థులు ఖచ్చితంగా ఖుషీ అవుతారు. ఇకపై అయినా ప్రవీణ్ లాంటి లీక్ రాయుళ్ల బెడద ఉండకూడదని కోరుకుందాం.