వామ్మో.. 30 మందిని కూడా ఇట్టే చంపేసే సామర్థ్యం ఉందట ఈ చేపకు..!

పాములు, తేళ్లు… వాటికి మనుషులు ఎంతో దూరంగా ఉంటారు. ఎందుకంటే అవి విషపూరితమైనవి.. అవి కరిస్తే ప్రాణాలకే ప్రమాదం. మరి.. వాటికే వణుకు పుట్టించే ఓ జీవి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

దాని పేరు పఫర్ ఫిష్. చూడటానికి ముద్దొచ్చే ఈ చేప చాలా ప్రమాదకరమైనదట. ఎంత ప్రమాదకరం అంటే దాదాపు 30 మంది మనుషులకు కూడా ఇట్టే చంపేయగల శక్తి ఉంటుందట దానికి. కాని.. అది చూడటానికి మాత్రం అలా కనిపించదు. దాని విషం చాలా డేంజర్. అది కరిస్తే హరీ అనాల్సిందే.

ఈ చేప గురించి నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ సిబ్బంది రీసెర్చ్ చేశారట. దాన్ని ఆక్వేరియంలో వేసి దానిపై పరిశోధనలు చేస్తున్నారట. ఈ సందర్భంగా పఫర్ చేప ఉన్న ఆక్వేరియంలో జర్రులు, తేళ్లు, పాములను వేస్తే.. ఆ చేప వాటికి ఏమాత్రం భయపడకుండా లటక్కున వాటిని తినేస్తుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవడంతో ఆ వీడియోను చూసి నెటిజన్లు తెగ భయపడుతున్నారు. వామ్మో.. ఇదేం చేపరా బాబోయ్. చూడటానికి ఇంత ఉంది.. కానీ.. దాని విషం మాత్రం ఇంత డేంజరా అని కామెంట్లు చేస్తున్నారు.