బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మైనపు బొమ్మను సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ విగ్రహాన్ని స్వయంగా అనుష్కనే ఆవిష్కరించింది. తన విగ్రహాన్ని చూసి తానే మురిసిపోయింది. అది మామూలు విగ్రహం కూడా కాదు. ఇంటరాక్టివ్ విగ్రహం. అంటే దాని దగ్గరికి వెళ్లినప్పుడు అది మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక.. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాక.. తన బొమ్మను చూడటానికి వచ్చిన అభిమానులకు ఓ జలక్ ఇచ్చింది అనుష్క.
తన బొమ్మలాగానే అక్కడ నిలబడి పోజిచ్చింది. అందరూ చూసి అది అనుష్క మైనపు బొమ్మ అనుకొని అక్కడికి వెళ్లి ఫోటోలు దిగడానికి ప్రయత్నించారు. వాళ్లు సెల్ఫీలు దిగుతుండగానే అనుష్క ఒక్కసారిగా కదలుతుండటంతో వాళ్లు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇలా.. చాలామంది అభిమానులను భయపెట్టింది అనుష్క. దీన్నంతా వీడియో తీసిన మ్యూజియం సిబ్బంది ఆ వీడియోను అనుష్క ప్రాంక్ వీడియో పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.