నాతో పెట్టుకుంటే హైదరాబాద్ లో ఎవ్వరూ ఉండరు.. అందరూ పారిపోవాల్సిందే: చంద్రబాబు

246

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఉన్న సర్పవరం జంక్షన్ రోడ్ లో జరిగిన సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి… నాతో పెట్టుకుంటే మీ హైదరాబాద్ బ్రాండ్ ఉండదు. ఎవ్వరు కూడా అక్కడ ఉండరు. పారిపోయే పరిస్థితి వస్తుంది. అనవసరంగా పెట్టుకోవద్దు. నేనే డెవలప్ చేశా. నీ గొప్పేం కాదు దాంట్లో. నాదే గొప్ప. కానీ.. ఉన్నపళంగా లాగేసుకున్నారు హైదరాబాద్ ను.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు.

AP CM chandrababu threatens telangana people

మళ్లీ పాత పాటనే అందుకున్నారు. ఇదివరకు ఎన్నోసార్లు హైదరాబాద్ ను డెవలప్ చేసింది తానేనని చెప్పుకున్న చంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రచారంలోనూ తెలంగాణ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. నాతో పెట్టుకుంటే హైదరాబాద్ లో ఎవ్వరూ ఉండరు. అందరూ పారిపోవాల్సిందే.. ఏమనకుంటున్నారో అంటూ బెదరించారు. అయితే.. ఆయన ఎవరిని బెదిరించారో? ఎవరిని అన్నారో మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది.

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఉన్న సర్పవరం జంక్షన్ రోడ్ లో జరిగిన సభలో చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు.. నెటిజన్లు మాత్రం చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. అయ్యా.. చంద్రబాబు.. గత ఐదేళ్ల నుంచి అమరావతిలో ఇటుక కూడా కట్టలేకపోయావు నువ్వు హైదరాబాద్ ను అభివృద్ధి చేశావా? హైదరాబాద్ నువ్వు ముఖ్యమంత్రివి కాకముందే అభివృద్ధి చెందింది. ఇప్పుడు కాదు.. 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. కొంపదీసి హైదరాబాద్ ను కట్టించిన కులి కుతుబ్ షా నువ్వేనా ఏంది అంటూ చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు.